ఎంసిసి ఉల్లంఘనలపై చర్యలు

ఎంసిసి ఉల్లంఘనలపై చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

ప్రజాశక్తి-ఉరవకొండ

ఎంసిసి ఉల్లంఘనలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. మంగళవారం ఉరవకొండ తహశీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేవంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించి రకరకాల అనుమతులు, కంట్రోల్‌ రూమ్‌, ఇతర ప్రక్రియలు మొదలయ్యాయన్నారు. ఇందులో భాగంగా ఎంసిసి ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. పబ్లిక్‌ ప్రాపర్టీపై 596, ప్రయివేట్‌ ప్రాపర్టీపై 399 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎంసిసి ఉల్లంఘనలకు సంబంధించి అధికారులపై ఫిర్యాదులు వచ్చిన తర్వాత విచారించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే వాలంటీర్లు, ఎఫ్‌.పి షాప్‌ డీలర్లు, ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నామన్నారు. అనుమతులకు సంబంధించి రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకూ 112 దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఆయా దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసిన తర్వాత నిర్దేశిత సమయంలోపు అనుమతులు ఇస్తున్నట్లు వివరించారు. ఆర్‌ఓ, తహశీల్దార్‌ కార్యాలయాల్లో సింగిల్‌విండో డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన అనుమతులు, తదితర వివరాలను వివరించారు.

➡️