నగదు పట్టివేత

నగదు పట్టివేత

పెద్దపప్పూరు మండలం మిడుతూరు వద్ద కారును తనిఖీ చేస్తున్న పోలీసులు

       పెద్దవడుగూరు : మండలంలోని మిడుతూరు గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎన్నికల నిబంధనలకు మించి నగదు తరలిస్తుండటంతో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం మిడితూరు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా వెంకట నాయుడు అనే వ్యక్తి తరలిస్తున్న రూ.6.15లక్షలను గుర్తించినట్లు తెలిపారు. అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ చూపకపోవడంతో సీజ్‌ చేసినట్లు తెలిపారు.

        రాయదుర్గం : పట్టణంలోని కణేకల్‌ రోడ్డు, అరబిక్‌ కళాశాల ఎదురుగా ఎఫ్‌ఎస్‌టీ బృందం, బిఎస్‌ఎఫ్‌ సిబ్బంది సోమవారం రాత్రి నగదు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎఫ్‌ఎస్‌టి బృందం, బిఎస్‌ఎఫ్‌ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా దబ్బిడి ఉమేష్‌ అనే వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.2,70,000 నగదును కణేకల్‌ క్రాస్‌ నుంచి మోటార్‌ సైకిల్‌లో తరలిస్తుండగా పట్టుకుని అప్పగించినట్లు రాయదుర్గం పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు.

➡️