నార్పలలో ఫర్టిలైజర్‌ యజమాని దారుణహత్య

హత్యకు గురైన వీరభద్ర

         నార్పల : నార్పల మండల కేంద్రంలోని కూతలేరు బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి 7-30గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఎరువుల దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య చేశారు. ఈ హత్యతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఇందుకు సంబంధించి మృతుని బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… పులివెందులకు చెందిన వీరభద్ర(40) పది సంవత్సరాల క్రితం నార్పలకు వచ్చిన ఎరువుల దుకాణం ఏర్పాటు చేశారు. దుకాణం ప్రారంభ సమయంలో తన సమీప బంధువైన రఘు భాగస్వామ్యంతో కలిసి దుకాణాన్ని నిర్వహించేవాడు. కొంతకాలం తర్వాత ఇద్దరికీ వ్యాపార ఆర్థికవాదేవీల్లో వివాదాలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. విడిపోయిన అనంతరం ఎవరికి వారు నార్పలలో వేర్వేరుగా ఎరువుల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. దుకాణాలు వేర్వేరుగా ఏర్పాటు చేసుకున్నా ఇద్దరి మధ్య ఆర్థిక పరమైన ఘర్షణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7-30 గంటల ప్రాంతంలో రఘు మరో వ్యక్తితో కలిసి వీరభద్ర ఎరువుల దుకాణం వద్దకు వెళ్లారు. అప్పటికే తనతో పాటు తీసుకెళ్లిన గొడ్డలితో రఘు వీరభద్రపై దాడి చేశారు. ఈ దాడిలో వీరభద్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో రఘు ఈ హత్యకు పాల్పడ్డాడని మృతుని బంధువులు పోలీసులకు తెలియజేశారు. హత్య విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మతుని భార్య, బంధువులతో వివరాలను సేకరించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలియజేశారు. హత్యకు సంబంధించిన దశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు.

➡️