పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు

పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు

అధికారులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

ప్రజాశక్తి-ఉరవకొండ

2024 సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉరవకొండ పట్టణంలోని జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను జాయింట్‌ కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను చర్చించి, సంబంధిత అధికారులకు తగిన సలహాలు, సూచనలు జారీ చేశారు. అన్ని రకాల ఏర్పాట్లను ముందుగానే చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఉరవకొండ కార్యాలయంలో ఎన్నికల నియోజకవర్గ నోడల్‌ అధికారులతో జెసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇఆర్‌ఒ శిరీషా, గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, తహశీల్దార్‌ హరినాథ్‌, ఎంపిడిఒ అమృతరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️