పిఒ, ఎపిఒలకు శిక్షణ కార్యక్రమాలు :కలెక్టర్‌

ర్యాండమైజేషన్‌ కార్యక్రమంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

          అనంతపురం కలెక్టరేట్‌ : ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా నియోజకవర్గాల పిఒలు, ఎపిఒలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి తెలియజేశారు. అనంతపురం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి హాల్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పీఓ, ఏపీఓల మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2,552 మంది పిఒ(ప్రిసైడింగ్‌ అధికారులు), 2,715 మంది ఎపిఒ (అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు)కు ఏప్రిల్‌ 5, 7, 14వ తేదీల్లో మూడు రోజులపాటు నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం సంబంధించి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఉరవకొండకు సంబంధించి ఉరవకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గుంతకల్లుకు సంబంధించి గుంతకల్లు డా||సర్వేపల్లి రాధాకష్ణ మున్సిపల్‌ హైస్కూల్‌, తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి తాడిపత్రి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, సింగనమల నియోజకవర్గానికి సంబంధించి బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఆర్‌బికె హైస్కూల్‌ ఫర్‌ హియరింగ్‌ ఇన్‌ ఫైర్‌ చిల్డ్రన్‌, కళ్యాణదుర్గానికి సంబంధించి కళ్యాణదుర్గం ఎస్వీజిఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి రాప్తాడు పంగల్‌ రోడ్‌ వద్దనున్న టీటీడీసీ, సిఎల్‌ఆర్సి భవనంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పోలింగ్‌ పర్సనల్స్‌ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఈ విషయమై సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు పోలింగ్‌ పర్సనల్స్‌కి తెలియజేయాలన్నారు. ఎన్నికల శిక్షణకు సంబంధించిన ట్రైనింగ్‌ ఆర్డర్స్‌ పోలింగ్‌ పర్సనల్స్‌ అందరికీ వస్తాయన్నారు. పోలింగ్‌ పర్సనల్స్‌ అందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అవసరమైన ఫామ్‌ – 12ను పూర్తి చేసుకుని శిక్షణకు వచ్చేలా వారికి ఆర్‌ఒలు స్పష్టంగా తెలపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారులు జి.వెంకటేష్‌, రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, రాంభూపాల్‌ రెడ్డి, ఈఆర్‌ఒ శిరీష, ఎన్‌ఐసి డిఐఒ రవిశంకర్‌, కలెక్టరేట్‌ ఏఓ అంజన్‌ బాబు పాల్గొన్నారు.పకడ్బందీగా ఈఎస్‌ఎంఎస్‌ అమలు : కలెక్టర్‌ఈఎస్‌ఎంఎస్‌ (ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్మెంట్‌ సిస్టం)ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సాధారణ ఎన్నికల దష్ట్యా ఈఎస్‌ఎంఎస్‌ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈఎస్‌ఎంఎస్‌ పరిధిలో ఖచ్చితంగా డేటా అప్డేషన్‌ ఎప్పటికప్పుడు జరగాలన్నారు. జిల్లాలో 20 అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు, 3 అంతర్‌ జిల్లా చెక్‌ పోస్టులు, 4 డైనమిక్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇక్కడ సీజర్స్‌ నమోదు పక్కాగా జరగాలన్నారు. సీజర్స్‌ నమోదుపై ఎఫ్‌ఎస్‌టి టీమ్‌లకు ఆర్‌ఒలు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, అడిషనల్‌ ఎస్పీ విజయభాస్కర్‌ రెడ్డి, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్‌ అధికారులు జి.వెంకటేష్‌, రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, రాంభూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️