బాదుడు ప్రభుత్వాన్ని సాగనంపుదాం

బాదుడు ప్రభుత్వాన్ని సాగనంపుదాం

కూలీలతో మాట్లాడుతున్న టిడిపి ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం

వివిధ రకాలు పన్నులు, ఛార్జీల బాదుడుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపుదామని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయమే మండలంలోని బి.కొత్తపల్లి గ్రామంలో వరినాట్లు వేస్తున్న కూలీలను అడిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటలు లేకపోవడంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి కరవైందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. మరోవైపు ప్రజల నెత్తిపై అనేక ఛార్జీల పెంపు, అధిక ధరలు, పన్నులు పెంపు బాదుడుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఈ సమయంలో టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం, ఆవస్యకత ఎంతైనా ఉందన్నారు. టిడిపి అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి చంద్రబాబును సిఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం ‘బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️