రేషన్‌కార్డుదారులకు రాగిపిండి పంపిణీ

రాగిపిండిని పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ గౌతమి

          అనంతపురం : ప్రజా పంపిణీలో భాగంగా కార్డుదారులకు రాగి పిండిని శుక్రవారం నుంచి పంపిణీ చేశారు. అనంతపురం నగరంలోని సూర్య నగర్‌లో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ఎం.గౌతమి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో పౌష్టికమైన బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, ఫోర్టిపైడ్‌ గోధుమపిండిని ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. రాగి పిండి ప్యాకెట్ల రూపంలో 11 రూపాయలకే అందిస్తోందన్నారు. జిల్లాకు 6,67,268 కిలోల రాగి పిండిని కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఎస్‌ఒ శోభారాణి, సిఎస్‌డిటి దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️