వేతనాలు ఇచ్చేంత వరకూ ఉద్యమం : సిఐటియు

వేతనాలు ఇచ్చేంత వరకూ ఉద్యమం : సిఐటియు

శ్రీరామిరెడ్డి తాగునీటి పంప్‌హౌస్‌ వద్ద ఆందోళన చేపడుతున్న కార్మికులు

ప్రజాశక్తి-కళ్యాణదుర్గం

శ్రీరామిరెడ్డి పథకం కార్మికులకు వేతనాలు చెల్లించేంత వరకూ ఉద్యమం ఆగదని సిఐటియు తాలూకా కార్యదర్శి అచ్యుత్‌ప్రసాద్‌ హెచ్చరించారు. వేతనాలు చెల్లించాలని కోరుతూ శ్రీరామిరెడ్డి తాగునీతి పథకం కార్మికులు చేపట్టిన ఆందోళన మంగళవారానికి రెండవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా స్థానిక పంపుహౌస్‌ వద్ద చేపట్టిన ఆందోళన చేపట్టారు. అయితే తాగునీరు సరఫరా చేయాలని స్థానిక వైసిపి నాయకులు దౌర్జన్యంగా మోటార్లు ఆన్‌ చేసే ప్రయత్నం చేశారు. దీంతో కార్మికులు అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్మికుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు చేరుకుని సర్దిచెప్పారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ నిత్యం పని చేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించకుండా వేధించడం మంచిది కాదన్నారు. కార్మికుల బకాయి వేతనాలు చెల్లించేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు వన్నూరుస్వామి, ఆనంద్‌, రామాంజనేయులు, వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు.

➡️