సిద్ధం’ను విజయంతం చేద్దాం

సిద్ధం'ను విజయంతం చేద్దాం

విలేకరులతో మాట్లాడుతున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ‘

ప్రజాశక్తి-అనంతపురం

మండల కేంద్రంలో నిర్వహించనున్న సిద్ధం సభకు భారీగా తరలివచ్చి సిఎం జగనన్నకు అండగా నిలుద్దామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభ దేశ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. 50 నెలల జగనన్న పాలన ప్రతి గుండె తలుపూ తట్టిందన్నారు. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారన్నారు. దేశం యావత్తు జగనన్న వైపు చూస్తోందన్నారు. సిద్ధం సభకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రతి కార్యకర్త చెబుతున్నాడన్నారు. రాయలసీమలోని 52 నియోజకవర్గాల నుంచి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో రాయలసీమ నుంచి 3 నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు గెలిచారని, ఈసారి అవి కూడా వైసిపికే ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు లక్షలాదిమంది తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా కనీసం వార్డు మెంబరు కూడా గెలవలేని నారా లోకేష్‌ మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. అనంతరం రూరల్‌ మండలం, రాప్తాడు మండల పరిధిలోని పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

➡️