‘సిద్ధం’ ఏర్పాట్లు పరిశీలన

'సిద్ధం' ఏర్పాట్లు పరిశీలన

‘సిద్ధం’ ఏర్పాట్లు పరిశీలిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం

రాప్తాడులో ఈనెల 18న సిఎం జగన్‌ నిర్వహించనున్న సిద్ధం సభ ఏర్పాట్లను ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డితోపాటు జిల్లా ఎమ్మెల్యే, నాయకులు మంగళవారం పరిశీలించారు. ఇందులో భాగంగా సభాస్థలి, వాహనాల పార్కింగ్‌, సౌకర్యాలను పరిశీలించి స్థానిక నాయకులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి సిద్ధం సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ రఘురాం, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, శంకరనారాయణ, వై.వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీమంత్రి నర్సేగౌడ్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️