సిఎం జగన్‌పై టిడిపి గ్లోబల్‌ ప్రచారం

సిఎం జగన్‌పై టిడిపి గ్లోబల్‌ ప్రచారం

విలేకరులతో మాట్లాడుతున్న వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నర్సింహయ్య

ప్రజాశక్తి-కళ్యాణదుర్గం

సీఎం జగన్‌కు రాష్ట్రంలో వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక టిడిపి నాయకులు గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీ తలారి రంగయ్య క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధం సభలకు వస్తున్న జనాన్ని చూపి టిడిపి, చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేదల దరి చేరాయన్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ఇకపోతే నేడు కళ్యాణదుర్గం మార్కెట్‌ యార్డులో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తున్నారన్నారు. కావున నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.గుంతకల్లు ఎమ్మెల్యేలతో ఎలాంటి విభేదాలు లేవుగుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డితో ఇలాంటి విభేదాలు లేవని ఎడిసిసి బ్యాంకు మాజీ ఛైర్మన్‌ పామిడి వీరాంజనేయులు స్పష్టం చేశారు. పామిడిలో జరిగిన ఆసరా కార్యక్రమంలో ఎడిసిసి బ్యాంకు ఛైర్‌పర్సన్‌ లిఖితను సమయాభావం లేకపోవడం వల్ల మాట్లాడేందుకు వీలు కాలేదన్నారు. ఈ విషయంపై మాట్లాడినందుకు ప్రతిపక్ష మీడియా సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారాలు చేసిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చిన్నచిన్న సమస్యలు తలెత్తడం సహజమే అన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం టిడిపిలో చేరాక ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు ఎంఆర్‌సి.రెడ్డి భీమిరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజ్‌కుమార్‌, ఎంపిటిసి నరసాపురం సూరిబాబు, గోళ్ల సూరి, ఒంటిమిట్ట స్వామి, జయం ఫణి, తదితరులు పాల్గొన్నారు.

➡️