విద్యాహక్కు చట్టం కాగితాలకే పరిమితమా…
ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పలలో పాఠశాలలో చదువుకుంటూ తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ గడవాల్సిన బాల్యం నార్పల రోడ్లపై యాచన చేస్తూ ఉంది. యాచన చేస్తున్న బాలున్ని చూస్తే హృదయం తరుక్కుపోతోంది వివరాల్లోకి నార్పల గూగూడు రోడ్డులో ఒక ఆటోలో దేవుళ్ళ పటాలు పెట్టుకొని ఒక మహిళ, ఒక పురుషుడు చిన్నారితో దుకాణాల వద్ద యాచాన చేయిస్తున్నారు. ఆ చిన్నారితో ప్రజాశక్తి మాట్లాడుతూ నీవు పాటశాల కు వెళ్లడం లేదా అని ప్రశ్నించగా లేదు అని సమాధానం ఇచ్చాడు ఆ అబ్బాయి పేరు కుమార్ అని తన సొంత ఊరు కడప అని తెలిపాడు. ప్రజా ప్రతినిధులు, విద్యాధికారులు విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాల బయట ఏ విద్యార్థి ఉండకూడదని. ప్రభుత్వ బడ్జెట్లో వేలాది కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయిస్తున్నారు. 14 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి కచ్చితంగా విద్యాహక్కు చట్టం ప్రకారం నిర్బంధ విద్య కల్పిస్తామని చెప్తున్నారు కానీ విద్యాహక్కు చట్టం యొక్క నియమ, నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని పలువురు విద్యావేత్తలు, సామాజిక సేవా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా విద్యాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బడి బయట ఉండి చదువుకోకుండా యాచక వృత్తిలో ఉన్న చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించి అటువంటి పిల్లలకు ప్రభుత్వ హాస్టల్లో సీట్లు ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పాలని గడిచిపోయిన కాలం కరిగిపోయిన బాల్యం తిరిగిరాదని పలువురు అంటున్నారు.