నేల ఒరిగిన అరటి పంట 

May 25,2024 12:09 #Anantapuram District

పరిశీలించిన సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలో శుక్రవారం రాత్రి గాలివానకు పుట్లూరుమండల వ్యాప్తంగా అరటిపంట పూర్తిగా దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా ఓబులాపురం కడపకల్లు సంజీవపురం చెర్లోపల్లి తదితర గ్రామాలలో అరటిపంట గెలలు వేసి పంట చేతికి వస్తాది అనే సమయంలో శుక్రవారం రాత్రి వచ్చిన గాలివానకు పూర్తిగా దెబ్బ తిన్నాయి. మండల వ్యాప్తంగా అరటి, మొక్కజొన్న, బొప్పాయి తదితర పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. కావున వెంటనే హార్టికల్చర్ అగ్రికల్చర్ అధికారులు పంట నష్టం అంచనా వేసి రైతులకు పంట నష్టపరిహారం అందేలా చూడాలని ప్రభుత్వ అధికారులను సిపిఎం నాయకులు కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది.  లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పంటలను పరిశీలించిన వారిలో ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి జి వెంకట చౌదరి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ సూరి నాయకులు టీ పెద్దయ్య భాస్కర్ రెడ్డి, నాగభూషణం రైతులు బాయినే నరసింహులు లోకేష్ నాయుడు సురేంద్రబాబు వెంకట్ నాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️