ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని నాయన పల్లి గ్రామ సమీపంలో ముచ్చుకోట-నాయనపల్లి ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం గుర్తుతెలియని వాహనం రైతు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని కొత్తపల్లికి చెందిన రైతు కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సాగర్ తెలిపారు.