తాను గీసిన చిత్రాన్ని కలెక్టర్‌కు అందిస్తున్న విద్యార్థిని నవ్యశ్రీ
ప్రజాశక్తి-రాయదుర్గం
రాయదుర్గం పట్టణం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని పి.నవ్యశ్రీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ చిత్రపటాన్ని పెన్సిల్‌తో గీసింది. ఈ చిత్రాన్ని కలెక్టర్‌కు అనంతపురంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద డీఆర్డీఏ- వెలుగు కార్యాలయం పీడీ ఛాంబర్ సోమవారం అందించింది. విద్యార్థిని పెన్సిల్‌తో గీసిన తన చిత్రపటాన్ని చూసిన కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బొమ్మ బాగా ఉందని, భవిష్యత్తులో ఉన్నతంగా చదువుకోవాలని విద్యార్థినికి కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా బాలిక మాట్లాడుతూ పెన్సిల్‌తో బొమ్మలు గీయడాన్ని నేర్చుకుంటున్నానని, అందులో భాగంగానే కలెక్టర్ చిత్రపటాన్ని గీశానన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో వరలక్ష్మి, రాయదుర్గం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రద, టీచర్ భాగ్యలక్ష్మి, బాలిక తల్లిదండ్రులు వెంకటేశ్వరి, నరసింహులు పాల్గొన్నారు.