ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక నార్పల శాఖ గ్రంథాలయంను శనివారం ఉమ్మడి జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి రమ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా గ్రంథాలయoలోని పలు రికార్డులు రిజిస్టర్లు పరిశీలించారు. గ్రంథాలయంలోని సౌకర్యాలపై పాఠకులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠకులకు అందుబాటులో ఏ పుస్తకాలున్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఏ పుస్తకాలు తెప్పిస్తున్నారు. తదితర అంశాలను పరిశీలించారు. మండల కేంద్రంలోని నిరుద్యోగ యువతీ యువకులు గ్రంథాలయంలోని పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రంథాలయ సెస్ బకాయిలు వసూలు చేయాలని తెలిపారు. ఆలయానికి ప్రహరీ గోడ లేకపోవడంతో రాత్రి సమయంలో పందులు కుక్కలు ఇతర జంతువులు గ్రంథాలయ పరిసరాలను అపరిశుభ్రమవుతున్నాయని గ్రంథాలయానికి ప్రహరీ గోడ నిర్మించాలని పలువురు పాఠకులు కార్యదర్శి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని జీవన సిబ్బంది పాఠకులు తదితరులు పాల్గొన్నారు.