వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ వినోద్‌కుమార్
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
కోర్టు కేసుల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులకు జవాబుదారీతనం వ్యవహరించాలని కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్ తెలియజేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో కోర్టు కేసులపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో నోడల్ అధికారులను నియమించామన్నారు. కోర్టు కేసుల పరిష్కారంలో ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన బృందాలు పని కీలకం అన్నారు. అందరూ సమన్వయంతో పరిపూర్ణంగా కోర్టు కేసులను పరిష్కారం చేయాలన్నారు. కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ రూల్ పొజిషన్ ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ ఎ.మాలోల, కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ వసంతలత, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, ఆయా శాఖల నోడల్ అధికారులు పాల్గొన్నారు.