కోడిపందేలు, పేకాట ఆడితే చర్యలు : ఎస్పీ

ఎస్పీ పి.జగదీష్‌

ప్రజాశక్తి-అనంతపురం

క్రైం సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయక క్రీడల పేరుతో జిల్లాలో ఎక్కడైనా కోడిపందేలు, పేకాట ఆడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీష్‌ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కోడిపందేలు, పేకాట నిర్వహుకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జూద క్రీడలు కాకుండా సాంప్రదాయ ఆటలు ఆడుకోవాలని సూచించారు. జూదం ఏదైనా ప్రజల జీవితాలను నాశనం చేస్తుందన్నారు. కోడి పందేల జూదరులు, కోడి కత్తులు తయారీదారులు, పేకాట, నిర్వహకులపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఇలాంటి వాటిలో పాల్గొంటే పోలీసు కేసులు నమోదై వారి జీవితాలు నాశనం అవుతాయన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎవరైనా జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

➡️