రెచ్చగొట్టే పోస్టులు పెడితే అడ్మిన్లపై చర్యలు

Jun 8,2024 12:51 #Anantapuram District

జిల్లా ఎస్పీ గౌతమిసాలి, IPS

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఎన్నికల ఫలితాల అనంతరం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, తదితర సోషల్ మీడియాలో చాలా మంది రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నట్లు తెలుస్తోంది వాళ్లింటిని ముట్టడిస్తాం… వీళ్లింటిని ముట్టడిస్తాం… దాడులు చేస్తాం అంటూ బెదిరింపులు లేదా తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు అంతేకాకుండా… వ్యక్తిగత దూషణలకు దిగడం… అవాస్తవాలు ప్రచారం చేస్తుండటం జరుగుతోంది ఇలా… రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్థితులు ఎదురవుతున్నాయ సోషల్ మీడియాలో ఈతరహా పోస్టులు పెట్టె వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ లలో గ్రూప్అడ్మిన్ లు గ్రూప్ సభ్యులు ఏదిబడితే అది పోస్ట్ చేయకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. లేకుంటే గ్రూప్ సభ్యులు చేసిన పోస్టులకు కూడా గ్రూప్ అడ్మిన్లే బాధ్యులు అవుతారు. ఒకవేళ అవి రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు, తప్పుడు ప్రచారాలు అయితే చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు రెచ్చగొట్టే పోస్ట్‌లు, ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం లేదా స్టేటస్‌లుగా పెట్టడం కూడా నిషిద్ధమని పేర్కొన్నారు. ఈ విషయంలో వాట్సాప్‌లోని గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

➡️