దిగబడిన ఎరువుల లారీ 

May 25,2024 11:34 #Anantapuram District

ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని బిటీపీ రోడ్డు రైల్వే గేటు సమీపంలో ఎరువుల లోడుతో గుమ్మగట్ట వైపు వెళుతున్న లారీ శనివారం ఉదయం దిగబడింది. అడుగుప్ప రోడ్డు అండర్ పాస్ వద్ద వాన నీటి మళ్లింపు కాలువ ఈ రైల్వే గేట్ గుండె వెళ్ళగా మట్టి వదులై లోడు లారీ దిగబడింది. దీంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్లు భవనాలు శాఖ అధికారులు వెంటనే వాహనాల రాకపోకలకు అనువుగా పరిస్థితులు చక్కదిద్దాలని వాహనదారులు కోరుతున్నారు.

➡️