ఒకచోట చేరిన పూర్వ విద్యార్థులు
ప్రజాశక్తి-నార్పల
మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో 1999-2000వ సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు. దాదాపు 24ఏళ్ల తర్వాత అందరూ కలుసుకోవడంతో ఒకరి క్షేమాలు మరొకరు తెలుసుకున్నారు. అనంతరం వారికి విద్యాబోధన చేసిన గురువులు భయపరెడ్డి చంద్రశేఖర్, పరమేశ్వర్‌రెడ్డి, జెసి నారాయణస్వామి, బాషా, సభిరాబేగం, వివేకానందరెడ్డి, నాయుడును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి, ప్రభుదాస్, హర్షవర్ధన్‌రెడ్డి, తిమ్మప్ప, మస్తాన్, భారత్‌రెడ్డి, అబ్దుల్, అనిల్, మహమ్మద్, వేణు, దితరులు పాల్గొన్నారు.