ప్రజాశక్తి-యల్లనూరు: మండల పరిధిలోని చిలమకూరు పరీక్ష కేంద్రంలో బుధవారం పదో తరగతి విద్యార్ధని మానస అశ్వస్థతకు గురైంది. పరీక్ష ప్రారంభంలో కళ్ళు తిరుగుతూ కూర్చున్న బెంచిలోనే కింద పడిపోయింది. దీంతో ఇన్విజిలెటర్ వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే యల్లనూరు ప్రాథమిక వైద్యులు లోకేష్ కుమార్ విద్యార్థిని పరీక్షించారు. ఈ సందర్బంగా వైద్యుడు మాట్లాడుతూ కంగారు పడాల్సిన అవసరం లేదని విద్యార్ధిని ఆహారం తీసుకోలేదన్నారు. దీంతో సిబ్బంది అంత ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విద్యార్ధిని అంబులెన్సులో యల్లనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
