ఆటో కార్మికులుర్యాపిడో సర్వీస్‌లను బ్యాన్‌ చేయాలి

ఆటో కార్మికులుర్యాపిడో సర్వీస్‌లను బ్యాన్‌ చేయాలి

ర్యాలీ నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

ఆటో కార్మికుల ఉపాధి దూరం చేస్తున్న ర్యాపిడో సర్వీస్‌లను బ్యాన్‌ చేయాలని సిఐటియు నగర కార్యదర్శి వై.వెంకటనారాయణ, భగత్‌సింగ్‌ ఆటో యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్‌.శీనా డిమాండ్‌ చేశారు. శనివారం సిఐటియు భగత్‌ సింగ్‌ ఆటో కార్మికుల యూనియన్‌ ఆధ్వర్యంలో ర్యాపిడో నిషేదించాలని ప్రచార యాత్ర నిర్వహించారు. ప్రచార యాత్ర తపోవనంలో ప్రారంభమై శాంతినగర్‌ బోర్డు, నీలిమా సర్కిల్‌, చంద్ర హాస్పిటల్‌ సర్కిల్‌ బస్‌ స్టాండ్‌ సర్కిల్‌, శ్రీకంఠం సర్కిల్‌, గుత్తి రోడ్డు ఐదు లైట్లు సర్కిల్‌ తాడిపత్రి బస్టాండ్‌, ఆర్‌టిసి బస్టాండ్‌ సర్కిల్‌ రైల్వే స్టేషన్‌ సర్కిల్‌ వరకు నిర్వహించారు. ర్యాపిడ్‌ను తక్షణం రద్దు చేయాలని, యాప్‌ ద్వారా ఆటో డ్రైవర్‌ల ఉపాది దూరం అవుతోందన్నారు. ఆటో డ్రైవర్‌లు అందరిని చైతన్యం చేస్తూ ఫిబ్రవరి 3వ తేదీన కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గోపాల్‌, న్యూ టౌన్‌ కార్యదర్శి ముత్తూజ, భగత్‌ సింగ్‌ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు నాగరాజు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షుడు వలి, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, రాజీవ్‌ కాలనీ ఉపసర్పంచ్‌ మసూద్‌, డివైఎఫ్‌ఐ నాయకులు నూరుల్లా, బాలకష,్ణ సిఐటియు నగర నాయకులు రాజు, లతీఫ్‌, వెంకటనారాయణ, ముసలప్ప, గ్రానైట్‌, టైల్స్‌ ప్లేయింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎర్రిస్వామి రెడ్డి, తాడిపత్రి బస్టాండ్‌ హమాలీ యూనియన్‌ నాయకులు ఆదినారాయణ, నారాయణస్వామి, మురళి, కల్లూరు బాషా, వెంకట్రాముడు, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

సిఐటియు న్యూ కమిటీ ఆధ్వర్యంలో

ర్యాపిడో సర్వీస్‌ నిలుపుదల చేయాలని సిఐటియు నగర న్యూ కమిటీ, భవత్‌ సింగ్‌ ఆటో యూనియన్‌ ఆధ్వర్యలో రెండవ రోజు పాదయాత్ర నగరంలో నిర్వహించారు. చిన్మయ నగర్‌ నుంచి జెఎన్‌టియు కళాశాల మీదుగా కలెక్టరేట్‌, సంగమేష్‌ సర్కిల్‌, ఐరన్‌ బ్రిడ్జి ఆటో స్టాండ్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి ముర్తుజా, ఆటో యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ ఆజాంబాషా, ఆదినారాయణ మాట్లాడుతూ 3వ తేదిన కలెక్టరేట్‌ ఎదుట నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామలింగారెడ్డి, ఆటో యూనియన్‌ నాయకులు శీనా, రామాంజి, రాజా, గపూర్‌, ఉలిగప్ప, నారాయణస్వామి, ఇర్పాన్‌, కెఎస్‌ఆర్‌.శీనా, పెరుగోపాల్‌, గౌస్‌, నాగేంద్ర, రఘు, ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️