కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమాలు

పోస్టర్లు విడుదల చేస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

జిల్లాలో కుష్టు వ్యాధిపై ఉన్న అపోహల గురించి ప్రజలను చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌ వైద్యాధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ భవన్‌లో కుష్టు వ్యాధి నియంత్రణ, వ్యాధిగ్రస్తులపై గుర్తింపునకు జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కుష్టు వ్యాధిని పూర్తిగా నియంత్రించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేపట్టాలన్నారు. అన్ని పాఠశాలు, హాస్టళ్లు పిల్లలకు వైద్య పరీక్షలు చేయాలన్నారు. అనంతరం కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని తెలియజేసే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ అధికారి రామచంద్ర రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా||జి.నారాయణస్వామి, జిల్లాలెప్రసీ ఎయిడ్స్‌, టీబీ నివారణ అధికారి డా||అనుపమ జేమ్స్‌, ఐఅండ్‌పిఆర్‌ డిఐపిఆర్‌ఒ గురుస్వామి పాల్గొన్నారు.

➡️