ఆయుధ పూజ చేస్తున్న జెఎన్‌టియు అధికారులు
ప్రజాశక్తి-అనంతపురం
దుర్గాష్టమి వేడుకల్లో భాగంగా నగరంంలోని జెఎన్‌టియు పరిపాలన భవనంలో గురువారం ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితుగా ఉపకులపతి హెచ్.సుదర్శనరావు, రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య దుర్గామాతకు పూజలు చేశారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ మంచి కలగాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపకులపతి, రెక్టార్, రిజిస్ట్రార్, డిఎపి, డిక్స్ కార్యాలయాలతోపాటు అకౌంట్, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్లు, ఎగ్జామ్స్ బ్రాంచుల్లో పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వసుంధర, యూనివర్సిటీ డైరెక్టర్లు పిఆర్.భానుమూర్తి, నాగప్రసాద్‌నాయుడు, జి.ప్రశాంతి, ఆర్.కిరణ్మయి, వైశాలి ఘోర్పడే, పి.సుజాత, సురేష్‌బాబు, బి.దుర్గాప్రసాద్, పద్మసువర్ణ, ఎస్‌వి.సత్యనారాయణ, ఎపి.శివకుమార్, పైనాన్స్ ఆఫీసర్ ఎం.శిరాజుద్ధీన్, భువనవిజయ, కె.మాధవి, కళ్యాణి రాధ, బి.ఓంప్రకాష్, బోధన, బోధనేతర, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తెలిపారు.