భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ అమలు చేయాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు: స్వాతంత్ర సమరయోధులు, విప్లవ యువకిశోరులు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతిని ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల కేంద్రంలో భగత్ సింగ్ కాలనీలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శంకర్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల యొక్క పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారం కొరకు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామన్నారు. అతి చిన్న వయసులో వారు దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన రియల్ హీరోలని కొనియాడారు. నాడు స్వేచ్ఛ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కొరకు అనేకమంది ప్రాణ త్యాగాలు చేసిన వారిలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లని గుర్తు చేసుకున్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వారి రాజకీయ స్వలాభం కోసం కులాలకు, మతాలకు మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. యువత భవిష్యత్ తరాల కోసం నాడు స్వాతంత్రోద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయులు చరిత్ర కలిగిన దేశం మనదని అలాంటిది నేడు మన దేశంలోని ప్రభుత్వ సంస్థలను సైతం ప్రైవేట్ పరం చేస్తూ యువత యొక్క శ్రమను కార్పొరేట్ రంగాలకు ఊడిగం చేసేటువంటి కుట్రను బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పన్నుతోందని అన్నారు. దేశానికి వెన్నెముక లాంటి రైతులను సైతం ఆందోళన బాట పట్టే విధంగా చేసిన ఘన చరిత్ర బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడానికి భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ యొక్క పోరాట స్ఫూర్తితో విద్యార్థులను, యువకులను చైతన్య పరిచి నిరంకుశ వైఖరితో నడుస్తున్న బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జయంతి వర్ధంతిలను అధికారికంగా జరపాలని అదేవిధంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శివ శంకర్, వెంకటమ్మ, కర్రన్,న లక్ష్మన్న, లక్ష్మీదేవి, కుల్లయమ్,మ ఇందిరమ్మ, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.