బిటిపికి నీరివ్వకుండా ‘దుర్గం’ నుంచి వైదొలుగుతా..

బిటిపికి నీరివ్వకుండా 'దుర్గం' నుంచి వైదొలుగుతా..

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు

ప్రజాశక్తి-బ్రహ్మసముద్రం

నియోజకవర్గంలోని భైరవాణితిప్ప ప్రాజెక్టుకు తప్పకుండా నీరు అందిస్తానని, లేకపోతే కళ్యాణదుర్గం నుంచి వైదొలుగుతానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం మండల పరిధిలోని ముద్దలాపురం గ్రామానికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పింఛన్ల పంపిణీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ ముద్దలాపురానికి ఆర్టీసీ బస్సు లేకపోవడం బాధాకరమన్నారు. గ్రామస్తుల ఆవేదనను విని బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపోతే రెండేళ్లలో భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తి చేసి చెరువులకు నీళ్లిస్తామన్నారు. అలాచేయని పక్షంలో ఈప్రాంతవాసులకు క్షమాపణ కోరి వైదొలుకుతానన్నారు. ఈ కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నీలాస్వామి, నాయకులు కురుగౌడ, చౌలం మల్లికార్జున, గోళ్ల వెంకటేశులు, జడ్పిటిసి ప్రభావతమ్మ, మంజుల వన్నూరు స్వామి, ఆర్టీసీ డిఎం రామచంద్రం, స్పెషలాఫీసర్‌ రజిత, తహశీల్దార్‌ సుమతి, ఎంపిడిఒ నందకిషోర్‌, ఎంఇఒ ఓబుళపతి, ఆర్‌ఐ నాగిరెడ్డి, ఇఒఆర్‌డి రంగనాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️