‘రాచపాళెం’కు చం.స్పందన జీవన సాఫల్య పురస్కారం

'రాచపాళెం'కు చం.స్పందన జీవన సాఫల్య పురస్కారం

‘రాచపాళెం’కు చం.స్పందన జీవన సాఫల్య పురస్కారం

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిని చం.స్పందన ఆత్మీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం వరించింది. స్వర్ణభారతి సాక్షిగా, పొలి, రెండు ప్రపంచాలు వంటి కవితా సంపుటాలను వెలువరించడంతోపాటూ అనేక కవిత్వ విశ్లేషణ వ్యాసాలు రాసిన సుదీర్గ కృషికి గుర్తింపుగా స్పందన కన్వీనర్లు రాచపాళెంను 2023 చం.స్పందన ఆత్మీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. త్వరలో అనంతపురంలో జరుగనున్న కార్యక్రమంలో రాచపాళెంకు నగదు బహుమతితోపాటుగా, జ్ఞాపిక, శాలువతో ఘనసత్కారం చేయనున్నట్లు ‘స్పందన’ అనంత కవుల వేదిక అధ్యక్షులు తూముచర్ల రాజారామ్‌, ప్రధాన కార్యదర్శి వి.చంద్రశేఖరశాస్త్రి సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాచపాళెంకు చం.స్పందన జీవన సాఫల్య పురస్కారం లభించినందుకు స్పందన సభ్యులు షమీవుల్లా, అంకే శ్రీనివాస్‌, నందవరం కేశవరెడ్డి, రాధేయ, షేక్‌ నబిరసూల్‌, బండి నారాయణస్వామి, రాయుడు, మధురశ్రీ తదితర సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

➡️