అనారోగ్యంతో చిరుత మృతి

మృతి చెందిన చిరుత

        పెద్దవడుగూరు : మండలంలోని భీమునిపల్లి సమీపంలోని కొక్కిరాయికొండలో ఆడ చిరుతపులి అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించింది. ఉపాధిహామి పథకం క్షేత్రస్థాయి సహాయకుడు బాషా అటుగా వెళ్తూ చిరుత మృతదేహాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ, పశువైద్యశాఖ, పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని చిరుతపులిని పరిశీలించారు. పరీక్షల అనంతరం నీటి దాహం, అనారోగ్యంతో చిరుత చనిపోయినట్లు గుర్తించారు. అటవీశాఖ రెంజ్‌ అధికారి మధుబాబు, సెక్షన్‌ అధికారి నారపరెడ్డి ఆధ్వర్యంలో చిరుత మృతదేహాన్ని గుత్తికి తరలించారు. గురువారం రోజున చిరుతకు పోస్టుమార్టం నిర్వహించి పూడ్చివేస్తామని బీట్‌ అధికారిణి మాధవి తెలిపారు.

➡️