ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం : ఏపీఎస్ ఆర్టీసీని అభివద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్ సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులతో బుధవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం నుంచి హైదరాబాద్, బెంగళూరులకు వోల్వో బస్సులను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలను పంపించాలన్నారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లకు స్కిల్ డెవలెప్‌మెంట్ నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాయితీ పాసులపై విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత్, డిపిఒ ప్రభాకర్ రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ ఎహసాన్ బాషా, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.