ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక సభ్యులు
ప్రజాశక్తి-నార్పల : మండల వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభ సమాచారాన్ని ముందస్తుగా తెలియజేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దివాకర్ కు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 791 జీవో ప్రకారం గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభలను గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు ముందస్తుగా దండోరాలు ద్వారా ముందస్తు సమాచారం అందజేయలన్నారు. స్థానిక ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని మండల వ్యాప్తంగా అన్ని గ్రామసభలు ఒకేసారిగా నిర్వహించడం వల్ల గ్రామ సభలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావడానికి అవకాశం ఉండదన్నారు. అందువల్ల ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రోజు గ్రామ సభను నిర్వహించి స్థానిక సమస్యలు గుర్తించి పరిష్కరించాలని గ్రామ సభలకు అన్ని శాఖల అధికారులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు అల్తాఫ్, కోశాధికారి టీవీ రెడ్డి, సహాయ కార్యదర్శి ప్రసాద్ సామాజిక కార్యకర్త రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.