చంద్రబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల అభినందనలు

Mar 23,2025 11:14 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల : తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నార్పల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల విజయ్ కుమార్ (బాబు) ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దళితులతో కలిసి ఎస్సి వర్గీకరణకు ఆమోదం తెలిపిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావ కాలం నుండి కూటమి ప్రభుత్వం పాలన వరకు వివిధ సందర్భాల్లో దళితుల వర్గీకరణ, దళితుల అభివృద్ధికి, చట్ట సభల్లో దళితులకు ఇచ్చిన ప్రాధాన్యతకు టీడీపీ చేసిన కృషిని దళితులకు రిజర్వేషన్ల వర్గీకరణకు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ పోరాటాలకు టిడిపి పార్టీ పూర్తి మద్దతు ఇచ్చిందని, దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అభివృద్ధి అయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారు. చంద్రబాబు పాలనలోనే దళిత వాడల రూపు రేఖలు మారాయి. తెలుగు దేశం పార్టీ దేశ రాష్ట్రపతిగా కె.ఆర్. నారాయణ ఎన్నికలో, లోకసభ స్పీకర్ గా జి.ఎం.సి. బాలయోగిని అవకాశము కల్పించి, ముఖ్యమంత్రి చంద్రబాబు దళితుల పట్ల చిత్తశుద్ధిని రుజువు చేశారు. అలాగే తొలి దళిత మహిళా స్పీకర్ గా ప్రతిభ భారతి కి అవకాశం ఇవ్వటం జరిగింది. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనకు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు అంబేద్కర్ కి భారతరత్న వచ్చేలా చేశారు. 2004లో పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేశారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ భవనాన్ని నిర్మించేందుకు ఎన్టీఆర్ గార్డెన్స్ కు ఆనుకొని 2 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ భవనం నిర్మించేందుకు టిడిపి ప్రభుత్వం తీవ్ర కృషి చేయడమైనది. ఇలా అనేక సందర్భాల్లో దళితులను అగ్రవర్ణాలకు సమాంతరంగా అభివృద్ధి, అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మన శింగనమల నియోజకవర్గం శాసనసభ్యురాలు బండారు శ్రావణి శ్రీ సహకారంతో ఇంకా కృషి చేస్తామని ఆకుల విజయ్ కుమార్ (బాబు) తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రంగాపురం పుల్లప్ప, మాజీ ఎంపీటీసీ వేణుగోపాల్ ఎంఆర్పిఎస్ నాయకులు రమణ తదితరులు పెద్ద ఎత్తున దళితులు పాల్గొన్నారు.

➡️