‘ఫీజుపోరు’ను జయప్రదం చేయండి

'ఫీజుపోరు'ను జయప్రదం చేయండి

సంఘీభావం తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం రూరల్‌

విద్యార్థుల ఫీజు బకా యిలు చెల్లించాలని డిమాండ్‌ చే స్తూ ఈనెల 5వతేదీన అనంతపుర ంలో నిర్వహించనున్న ఫీజుపోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాల ని వైసిపి అనంతపురం జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు రమేష్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో ఐక్యవిద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రూ.3,900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతిదీవెన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 5న అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కావున జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎఐఎస్‌బి జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీ, పిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, జిబిఎస్‌ఎస్‌ జాతీయ ఉపాధ్య క్షులు మల్లికార్జుననాయక్‌, గిరిజన విద్యార్థి నాయకులు లక్ష్మీపతినాయక్‌, ఎఐఎస్‌బి జిల్లా అధ్యక్షులు బిల్లే జగదీష్‌, ఎస్వీఎస్‌ఎఫ్‌ బీసీ చక్రధర్‌యాదవ్‌, హర్ష, ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జన్నే చిరంజీవి, బిసి ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కేశవగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️