రూపానంద రెడ్డి
ప్రజాశక్తి – పుల్లంపేట : రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆడ చైర్మన్ ముక్కా రూపనంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రూపానంద రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి మరియు సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. సమస్యలన్నిటికీ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం జరిగిందని పేర్కొన్నారు. రైల్వే కోడూరు ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు. ప్రతి గ్రామంలో ప్రతి వీధికి సిమెంటు రోడ్డు వేయించడం జరుగుతుందని విద్యుత్ త్రాగునీరు సమస్య లేకుండా చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని పేర్కొన్నారు.