వివాదాస్పద డ్రెయినేజీ పరిశీలన

వివాదాస్పద డ్రెయినేజీ పరిశీలన

డ్రెయినేజీని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

ప్రజాశక్తి-నార్పల

మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ ఆవరణలో గాంధీ సర్కిల్‌ నుంచి కూతలేరు వంక వరకూ వివాదాస్పదంగా మారిన డ్రెయినేజీ కాలువను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గురువారం పరిశీలించారు. మండల నడిబొడ్డున బస్టాండ్‌ ఆవరణలో గుంతలు తవ్వి ఇలా వదిలేస్తే ఎలా..? అని అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. స్థానిక సమస్యలపై అధికారులు ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించగా.. అవన్నీ అవసరం లేదని, తన ఆదేశాలను పాటించాలని సూచించారు. ఈ సందర్భంంలో కొందరు ఎమ్మెల్యే సమక్షంలోనే వాగ్వివాదానికి దిగగా వారిని వారించారు. తర్వాత స్థానికంగా నివాసం ఉండే దూల్‌పేట కాలనీవాసులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఎమ్మెల్యేకు విన్నవించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే కాలనీవాసులకు హామీ ఇచ్చారు. తర్వాత కాలువ నిర్మాణ పనులు తమకే ఇవ్వాలని ఓ మహిళ ఎమ్మెల్యేకు విన్నవించగా పైప్‌లైన్‌ పనులు ఎవరంటే వారు చేయడానికి వీలుకాదని, అధికారులు మాత్రమే చేస్తారని వివరించారు. ఇకపోతే కూతలేరు వంకలో పేరుకొని పోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని అధికారులను ఆదేశించారు. వాల్మీకి విగ్రహం వద్ద ఉన్న కుండలను తొలగించాలని సూచించారు. అలాగే మండల కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించాలని సూచించారు. తర్వాత కూతలేరు బ్రిడ్జి సమీపంలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బండ్లపల్లి కుళ్లాయప్ప, బుక్కరాయసముద్రం, నార్పల నీటి సంఘాల అధ్యక్షులు ఆలం నాగార్జున, గవ్వల పరంధామ, ఆకుల విజరుకుమార్‌ (బాబు), జిసి బాబు, ఆకుల ప్రసాద్‌, సుల్తాన్‌పేట మహేష్‌నాయుడు, జనసేన మండల కన్వీనర్‌ గంజికుంట రామకృష్ణ, ఎంపిడిఒ గంగావతి, డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనివాసమూర్తి, సిఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ సాగర్‌, మండల సర్వేయర్‌ బ్రహ్మానంద, ఇఒఆర్‌డి శైలజారాణి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ జనార్ధన్‌, మేజర్‌ పంచాయతీ కార్యదర్శి శ్యామల, వీఆర్వోలు నిరంజన్‌రావు, శివరామ్‌, రామాంజనేయులు, బాలనాగి నరేష్‌, గూగూడు జాఫర్‌, సాలేహా, రామానాయుడు, ప్రసాద్‌ నాయుడు, చిన్నచౌదరి,ఎల్‌ ఇస్మాయిల్‌, ప్రదీప్‌, లోకేష్‌, రామాంజనేయులు, వేణుగోపాల్‌, నరసింహులు, అంకన్న, పప్పూరు సూర్యనారాయణ, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

➡️