ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న కూలీలకు కౌన్సిలింగ్

Nov 29,2024 11:46 #Anantapuram District

 ఏఎస్ఐ.నాగరాజు, పోలీసులు 

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక గూగూడు రోడ్డులో మామిడికాయలు పీకడానికి వెళ్తున్న వ్యవసాయ కూలీలు బొలెరో వాహనంలో ప్రమాదకరంగా కూర్చొని ప్రయాణం చేస్తుండడంతో అటువైపుగా వస్తున్నటువంటి ఏఎస్ఐ నాగరాజు కానిస్టేబుల్స్ అమర్, మైనుద్దీన్ లు బొలెరో వాహనాన్ని అపి డ్రైవర్ ను మందలించి ప్రమదకరంగ వాహనంలో కూర్చొని ప్రయాణం చేస్తున్న వ్యవసాయ కూలీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు కూలీలతో మాట్లాడుతూ ఇటువంటి నిర్లక్ష్య ప్రయాణాలతో నిండు ప్రాణాలు బలి అవుతున్నయీ అని మీ నిర్లక్ష్యంతో మిమ్మల్ని నమ్ముకొని ఇంటి వద్ద ఉన్న మీ పిల్లలు, కుటుంబ సభ్యులు అనాధలవుతారని ఇటీవల కాలంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. గత వారం రోజుల క్రితం గార్లదిన్నె వద్ద ఒకేసారిగా ఏడు మంది వ్యవసాయ కూలీలు ప్రమాదంలో మరణించినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు రాలేదని ఆగ్రహించారు. మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పద్ధతి కాదని ప్రతి ఒక్కరికి సొంత జాగ్రత్త అన్నది ఖచ్చితంగా ఉండాలని వ్యవసాయ కూలీలను హెచ్చరించారు. మరొకసారి ఇష్టానుసారంగా కూలీలను వాహనంలో ఎక్కించుకుంటే వాహనాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని డ్రైవర్ను మందలించారు.

➡️