ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలో శనివారం రాత్రి వీచినవీదురుగాలులకు వందల ఎకరాలు బొప్పాయి, అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మండలంలోని మడ్డిపల్లి, మడుగుపల్లి, ఎల్లుట్ల, జంగారెడ్డిపేట, రంగా రాజు కుంట, కుమ్మనమల, తదితర గ్రామాలలో నీ పంటలు నేల వరగడంతో రైతులు తీవ్ర నష్టపోయారు. నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో ఈదురు గాలుల వలన పంటలన్ని నీలమట్టమయ్యాయి. ముఖ్యంగా బొప్పాయి మొక్కజొన్న, అరటి పంటలకు సాగు చేయడానికి ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో పంట అంతా నేలకొరకడంతో రైతులు పెట్టిన పెట్టుబడి తోపాటు అదనంగా వస్తాయనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటల పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని మండలంలోని నష్టపోయిన రైతులు కోరుకుంటున్నారు.
