మొక్కల పెంపకం : కలెక్టర్‌

Jun 11,2024 22:19 #విస్తతంగా

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ డా||వినోద్‌కుమార్‌

         అనంతపురం కలెక్టరేట్‌ : వర్షాకాలం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తతంగా చెట్లు, మొక్కల పెంపకం చేపట్టాలని కలెక్టర్‌ డా||వి.వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో మొక్కల పెంపకంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చెట్లు, మొక్కల పెంపకం కోసం డీఎఫ్‌వో, సోషల్‌ ఫారెస్ట్రీ, బీసీ వెల్ఫేర్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ఐసిడిఎస్‌, డిఈఓ, ఉపాధి హామీ, తదితర శాఖల పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో పచ్చదనం సంతరించుకునేలా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. 30 రకాల చెట్లను నాటేలా దష్టి పెట్టాలని, ఒకే వీధిలో ఒకే విధమైన చెట్లు ఉండాలన్నారు. అన్ని మున్సిపాలిటీలలో వ్యక్తిగతమైన శ్రద్ధ పెట్టి పార్కులు, ఇతర చోట్ల మొక్కల పెంపకం చేపట్టేలా చూడాలన్నారు. మొక్కల పెంపకంలో స్వచ్ఛంద సంస్థలను గుర్తించి భాగస్వామ్యం చేయాలన్నారు. భవిష్యత్తును గుర్తుపెట్టుకుని మొక్కల పెంపకం విస్తతంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏ వీధికి ఏ రకమైన చెట్లు నాటాలి అనేది గుర్తించాలని, ప్రతి మూడు మీటర్లకు ఒక చెట్టు ఉండేలా చూడాలని, ఎక్కడైనా చెట్లు తుంచేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతపురం నగరంలో అశోక్‌ నగర్‌, రాంనగర్‌ 80 ఫీట్‌ రోడ్‌, జెఎన్టీయు రోడ్‌, ఆర్టీవో ఆఫీస్‌ రోడ్‌, గౌరవ గార్డెన్‌, తదితర ప్రాంతాలను గుర్తించి మొక్కలను నాటాలన్నారు. మొక్కల సంరక్షణ కోసం వార్డు స్థాయి అధికారులను నియమించాలన్నారు. బీసీ వెల్ఫేర్‌, సోషల్‌ వెల్ఫేర్‌, విద్యా శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో విరివిగా మొక్కలు పెంపకం చేపట్టాలన్నారు. ఎవరైతే మొక్కలు బాగా నాటుతారో వారికి అవార్డు అందిస్తామన్నారు. చరిత్ర సష్టించేలా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, డిఎఫ్‌ఒ వినీత్‌ కుమార్‌, మున్సిపల్‌ ఆర్డీ పివివిఎస్‌.మూర్తి, ఐసిడిఎస్‌ పీడీ శ్రీదేవి, సోషల్‌ వెల్ఫేర్‌ జెడి మధుసూదన్‌, డీఈవో వరలక్ష్మితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️