కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
అక్టోబర్ 1వ తేదీన జిల్లా వ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్ తెలియజేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్లు, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన ఉదయం 6 గంటలకు జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రారంభం కావాలన్నారు. సంబంధిత అధికారులు ముందుగానే పింఛన్ మొత్తాన్ని డ్రా చేసుకోవాలని సూచించారు. ఇక జిల్లాలో విస్తతంగా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్డీఏ పీడీ ఓబులమ్మ, ఆర్డీఓలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.