సబ్ జైల్లో తనిఖీ చేసిన జిల్లా జడ్జి

May 18,2024 14:18 #Anantapuram District

ప్రజాశక్తి-గుత్తి : పట్టణంలోని ప్రత్యేక ఉపకారాగారాన్ని శనివారం జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జైలు వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలేసి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పరిసరాలను పరిశీలించారు. జైలులోని వంటగదిలోని ఆహారాన్ని ఆయన పరిశీలించారు. స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, ఖైదీల గదులను పరిశీలించారు. ఖైదీలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ మహేశ్వరుడు, బార్ అసోసియేషన్ ఇన్చార్జ్ అధ్యక్షుడు పిడి.రత్నం, న్యాయవాదులు గంగాధర్ కుమార్, ఎ.సూర్యనారాయణ, ఎవరప్పా షఫీ వుల్లా, టైపిస్ట్ సాదిక్ వలి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

➡️