క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి

మాట్లాడుతున్న జెఎన్‌టియు ఇన్‌ఛార్జి విసి హెచ్‌.సుదర్శనరావు

ప్రజాశక్తి-అనంతపురం

జెఎన్‌టియు అనుబంధ కళా శాల తైల సాంకేతిక, ఔషధ పరిశోధనా సంస్థలో విద్యను అభ్యశించే విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జెఎన్‌టి యు ఇన్‌ఛార్జి ఉపకులపతి హెచ్‌. సుదర్శనరావు పిలుపునిచ్చారు. శనివారం ఒటిపిర్‌ఐ డైరెక్టర్‌ జివి.సుబ్బారెడ్డి అధ్య క్షతన ఒటిపిర్‌ఐ 2024వ బ్యాచ్‌ ఫార్మా-డి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సీనియర్‌ విద్యార్థులు ఆహ్వానం పలుకుతూ ఫ్రెషర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా-డి. కోర్సుకు ఎంతో విశిష్ట ప్రాధాన్యత ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ బి.దుర్గాప్రసాద్‌, ఫార్మా-డి హెచ్‌ఒడి ఇ.పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️