అంతర్జాతీయ ప్రతినిధులకు సాగు పద్ధతుల వివరణ

Nov 29,2024 13:14 #Anantapuram District

ప్రజాశక్తి-కుప్పం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించేందుకు శుక్రవారం కుప్పంనకు విచ్చేసిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందంనకు కుప్పం ఎం పి డి ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులు, వాటి ఉపయోగాలపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా ఏ పి ఎస్ ఆర్ టి సి వైస్ చైర్మన్ పి ఎస్ ముని రత్నం విచ్చేశారు. వీరితో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీ కృష్ణ, డిపిఎం వాసు, నాయకులు డా.వెంకటేష్, సోమశేఖర్, వినోద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ బృందంలో 20 దేశాలకు చెందిన 51 మంది ప్రతినిధులతో కూడిన బృందంలో భారతీయ ప్రతినిధులు, ఆగ్రో ఎకాలజీ అభ్యాసకులు, పరిశోధకులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు పాల్గొన్నారు.

➡️