ఫక్రుద్దీన్ సేవలు చిరస్మరణీయం

Apr 12,2025 11:26 #Anantapuram District

ఘనంగా సన్మానించిన ముస్లిం సోదరులు

ప్రజాశక్తి-నార్పల: మండల కేంద్రంలోని స్థానిక జామియా మసీదు మౌజన్ (దేవుని సేవకుడు) గా 14 సంవత్సరాలుగా సేవలందించిన ఫక్రుద్దీన్ ను స్థానిక జామియా మసీదులో పలువురు ముస్లిం సోదరులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జామియా మసీదులో గత 14 ఏళ్లుగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ఆ అల్లా ఆయన శేష జీవితం ప్రశాంతంగా గడపడానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూతవల్లి ఇక్బాల్ మాజీ మూత వల్లిలు శంశోద్దిన్, అసిక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.

➡️