రైతులు అధిక దిగుబడులు సాధించాలి

రైతులు అధిక దిగుబడులు సాధించాలి

కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ

ప్రజాశక్తి-గుత్తి

శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలను పాటించి రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు అధిక దిగుబడులను సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఉమామహేశ్వరమ్మ సూచించారు. మంగళవారం పట్టణంలోని సిఎల్‌ఆర్‌సి కార్యాలయంలో ‘2024 ఖరీఫ్‌ సాగుకు సయాయత్తం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులందరికీ రాయితీతో కూడిన నాణ్యమైన వేరుశెనగ విత్తనాలను ఇస్తున్నామన్నారు. అలాగే రైతులు అంతర పంటలను కూడా సాగు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ మద్దిలేటి, ఎడిఎ ఎం.వెంకటరాముడు, శాస్త్రవేత్తలు నటరాజ్‌, భాస్కర్‌, చందన, ఎఫ్‌టిసి ఐ.శ్రీనివాసులు, గుత్తి మండల వ్యవసాయ అధికారి ముస్తాక్‌అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

పామిడి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ‘ఖరీఫ్‌ సాగుకు సమాయత్తం.. పంటల సాగుపై రైతులకు అవగాహన’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఉమామహేశ్వరమ్మ ముఖ్య అతిథిగా హాజరై పంటల సాగుపై అవగాహన కల్పించారు. రైతులు, అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. హైబ్రిడ్‌ కందిరకాల గురించి వివరించారు. విత్తనాలు తీసుకున్నప్పుడు రైతులు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. జింక్‌, జిప్సం, గడ్డి మందులు అమౌంట్‌ కట్టిన వెంటనే ఆర్‌బికెలో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త చందన మండల వ్యవసాయశాఖ అధికారిణి లీలా వసుంధర, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

➡️