నల్లపల్లి విజయ్ భాస్కర్
రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్
ప్రజాశక్తి-అనంతపురం క్రైం: రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్ధిక బకాయిల పై చర్చ జరగాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగులకు ఐ ఆర్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, ఇప్పటికే ఉద్యోగులకు 20 వేల కోట్ల కరువుభత్యం బాకాయిలు, సరెండర్ లీవులు, పి. ఎఫ్, ఏపీ జి ఎల్ ఐ బాకాయిలు, మెడికల్ బిల్లులు తదితర అంశాలపై చర్చ జరగాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని కూటమి ప్రభుత్వం పై ఉద్యోగులందరూ ఎంతో నమ్మకం తో ఉన్నారని అన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్ధిక బకాయిల విడుదల పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
