సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ 

May 25,2024 14:21 #Anantapuram District

ప్రజాశక్తి-ఆత్మకూరు :  జిల్లా ఎస్పీ గౌతమీ శాలి, ఐపిఎస్ ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన P. సిద్దరాంపురం, ఆత్మకూరు , గొరిదిండ్ల, ముట్టాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్, గ్రామసభలు నిర్వహించారు. ఆత్మకూరు ఎస్సై మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలోని ప్రధాన రహదారులలో మరియు ముఖ్యమైన కాలనీల గుండా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. కౌంటింగ్ రోజూ ప్రశాంత వాతావరణం నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు. జూన్ 4 కౌంటింగ్ రోజూ ఏ పార్టీ వరైన బాణసంచా కాల్చడం , విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం నిషేధం అలా చేసిన వారిపై కేసులు నమోదు చేయబడతాయి. అనంతరం  కేంద్ర సాయుధ పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు.

➡️