గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటు

Jun 8,2024 13:18 #Anantapuram District

సీఐ శ్రీధర్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి
ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని మహిళా పోలీసులు, వీఆర్వోలు, మహిళా సంఘాల సభ్యులు స్థానికులతో కలిపి శాంతి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా సహకరించాలని చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకోకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు శాంతియుత జీవనం సాగించాలని సిఐ శ్రీధర్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో వీఆర్వోలు మహిళా పోలీసులు మండలంలోని వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో గొడవలకు దిగడం ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడడం వంటివి చేయరాదని ప్రతి ఒక్కరు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. అదేవిధంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మండల వ్యాప్తంగా ఎటువంటి వివాదాలు జరగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతం గా జరగడం ఒక మంచి పరిణామం అని అందుకు సహకరించిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులకు మండల ప్రజలకు సిఐ శ్రీధర్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా మండలంలోని అన్ని గ్రామాల్లో ఇలాగే శాంతియుత వాతావరణం ఉండే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక పోలీస్ సిబ్బంది మండలంలోని వివిధ పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️