మందులపై జీఎస్టీ ఎత్తివేయాలి

మందులపై జీఎస్టీ ఎత్తివేయాలి

మెడికల్‌ రెప్‌ల జిల్లా కమిటీ నాయకులతో రాష్ట్ర కమిటీ నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ప్రజలకు ఆరోగ్య అవసరాల వైద్య మందుల ధరలు తగ్గించి పరికరాలపై జిఎస్‌టి ఎత్తివేయాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటి సభ్యుడ డాక్టర్‌ ఆదర్శ్‌రెడ్డి, కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి, మెడికల్‌ సేల్స్‌ రెప్రజెంటెటీవ్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌ అన్నారు. ఆదివారం ఏపి ఎంఎస్‌ఆర్‌యు ఆధ్వర్యంలో హెచ్‌ఎల్‌సి మెడికల్‌ హాల్‌లో వార్షిక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఐఎంఏ రాష్ట్ర కమిటి సభ్యులు డాక్టర్‌ ఆదర్శ్‌రెడ్డి, కెమిస్ట్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమయ్య, సిఐటియు జిల్లా కోశాధికారి గోపాల్‌, నగర కార్యదర్శి వెంకటనారాయణ, సేల్స్‌ రెప్స్‌ యూనియన్‌ కన్వీనర్‌ శ్రీరాములు, రాష్ట్ర కమిటి సభ్యులు సురేంద్ర గుప్తా హాజరై మాట్లాడారు. ఫార్మా కంపెనీల ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. లేబర్‌ కోడ్‌లను ఉప సంహరించాలని కోరారు.

ఎపి ఎంఎస్‌ఆర్‌యు నూతన కార్యవర్గం ఎన్నిక

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సేల్స్‌ రెప్రజెంటేటీవ్‌ల యూనియన్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు రాష్ట్ర నాయకులు మనోహర్‌ తెలిపారు. ఎపి ఎంఎస్‌ఆర్‌యు జిల్లా అధ్య క్షుడు అమర్‌నాథ్‌, కార్యదర్శి చంద్రశేఖర్‌, కోశాధికారి విజయ నాయుడు, ఉపాధ్యక్షులు మంజునాథ్‌, నరేంద్ర, ఉప కార్యదర్శులు కదిరప్ప, రామాంజినేయులను ఎన్నుకున్నట్లు తెలిపారు.

➡️