ఎన్టీఆర్‌ వర్థంతికి భారీ ఏర్పాట్లు

ఎన్టీఆర్‌ వర్థంతికి భారీ ఏర్పాట్లు

ఏర్పాట్లను పరిశీలిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్థంతికి అనంత పురం నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 18న ఎన్టీఆర్‌ వర్ధంతిని నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయల్‌ మురళి, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి సరిపూటి రమణ, పద్మశాలి ఫెడరేషన్‌ డైరెక్టర్‌ పోతుల నరసింహులు, రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చాకలి పరమేష్‌, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కడియాల కొండన్న, మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఫిరోజ్‌ అహ్మద్‌, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ, ఇతర నాయకులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పరిశీలించి, అక్కడ రంగులు వేయించారు. ఎన్టీఆర్‌ వర్థంతి రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు నారాయణస్వామి యాదవ్‌, మణికంఠ బాబు, టిఎన్‌టియుసి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మోహన్‌ కుమార్‌, టిడిపి నాయకులు ఆదినారాయణ, తాటి మధు, మున్వర్‌, పూల బాషా, సిరిసాల రాంబాబు, చెక్క నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️