ప్రజాశక్తి-రాయదుర్గం: రాయదుర్గంలో పోలీసులు శనివారం నాకాబంది, వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ జయకుమార్ మరియు సిబ్బంది పట్టణంలోని కోట మారమ్మ గుడి, మల్లాపురం లేఅవుట్, బళ్ళారి రోడ్డు ప్రాంతంలో ఇల్లు, దుకాణాలు పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కర్ణాటక అక్రమ మద్యం నిల్వలు అమ్మకాల గురించి విచారించారు. తనిఖీ చేశారు. బళ్లారి రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులకు జరిమానా విధించారు. మోటార్ వాహనాల చట్టం గురించి అవగాహన కల్పించారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.
